ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్ - p.ratnakar

అమెరికాలో వైకాపా ప్రతినిధిగా ఉన్న రత్నాకర్​కు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని ఇచ్చింది. ఆయన నియామకానికి సంబంధించిన కాలపరిమితి, ఇతర మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

రత్నాకర్

By

Published : Sep 12, 2019, 6:30 AM IST

ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పండుగాయల రత్నాకర్​ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకానికి సంబంధించిన కాలపరిమితి, ఇతర మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ పేర్కొంది. రత్నాకర్ బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్​ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన రత్నాకర్ 2015 నుంచి వైకాపాలో క్రియాశీలకంగా ఉన్నారు. ప్రస్తుతం వైకాపా అమెరికా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details