కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలతో తెదేపా జాతీయాధ్యుక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, కమలాపురం నుంచి పుత్తా నరసింహారెడ్డిని అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించారు.
మైదుకూరు, కమలాపురం వీళ్లకే - kamalapuram
అసెంబ్లీ అభ్యర్థులుగా మైదుకూరు నుంచి పుట్టా, కమలాపురం నుంచి పుత్తా పేర్లను తెదేపా అధిష్ఠానం ఖరారు చేసింది.
శాసన సభ ఎన్నికల బరిలోకి పుట్టా, పుత్తా
బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిపై త్వరలోతుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. బద్వేలు అభ్యర్థిగా లాజరస్ పేరు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కడప నుంచి శ్రీనివాస్ రెడ్డి, అష్రాఫ్ పేర్లు పరిశీలనలో ఉండగా.. ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థి ఎంపిక పెండింగ్లో ఉంది.
Last Updated : Feb 22, 2019, 10:05 AM IST