ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్వాసితులకు పునారావాసం కలేనా?!!

జలాశయాలను నిర్మించాలంటే మొదట నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. ఇవన్నీ అయ్యాకే ప్రాజెక్టులు నిర్మించాలి. కడప జిల్లాలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. బ్రహ్మసాగర్ సోమశిల జలాశయాల నిర్మాణం వల్ల ముంపు వాసులకు పునరావాసం కలగానే మిగిలింది.

ప్రాజెక్టులు

By

Published : May 7, 2019, 9:43 PM IST

Updated : May 10, 2019, 7:19 AM IST

నిర్వాసితులకు పునారావాసం కలేనా?!!

కడప జిల్లాలో సోమశిల , బ్రహ్మ సాగర్ జలాశయం నిర్మాణం వల్ల వందల గ్రామాలు ముంపుకు లోనయ్యాయి. అధికారులు పునరావాసం కల్పిస్తామని చెప్పి గ్రామాలను ఖాళీ చేయించారు. జలాశయాలను నిర్మించారు. ఏళ్లు గడుస్తున్నా పునరావాసం ఒట్టిమాటే అయింది.
బ్రహ్మ సాగర్ జలాశయం కింద జంగం రాజు పల్లి తో పాటు మరో నాలుగు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం నిర్మాణం కారణంగా గోపవరం, అట్లూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, నందలూరు మండలాల్లో గ్రామాలు ముంపు బాధిత ప్రాంతాలుగా మారిపోయాయి. ఇంతవరకూ ఈ గ్రామ నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. గట్టుపల్లి, జంగంరాజుపల్లి గ్రామస్థులు బద్వేలులో ఉంటున్నారు. పునరావాసం విషయంలో.. వారి పరిస్థితి ఇలాగే ఉంది. రహదారులు తాగునీరు, పాఠశాల, దేవాలయం ఇలాంటివి నిర్మాణానికి నోచుకోలేదు. ముఖ్యంగా తాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి.. తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు వేడుకుంటున్నారు.

Last Updated : May 10, 2019, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details