'రాజకీయాలకు అతీతంగా.. సీఎంఆర్ఎఫ్ సాయం' - arogyasri
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తన ప్రధాన లక్ష్యమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కిందకు రాని వ్యాధుల చికిత్సకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిధులు సాయం చేయడానికి కృషి చేస్తామన్నారు.
రాష్ట్రంలో పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కడప జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. జూన్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కిందికి రాని వ్యాధులకు సంబంధించి లెటర్ అఫ్ క్రెడిట్లను బాధితులకు ప్రొద్దుటూరులోని వైకాపా కార్యాలయంలో అందజేశారు. రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు నిధులను ఇస్తామన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో అమలు చేస్తున్నారని చెప్పారు.