కడప జిల్లా అట్లూరులో సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి సగిలేరు నది దాటే ప్రయత్నలో బురదలో కూరుకుని అక్కడిక్కడే మృతి చెందాడు.పశువులు ఇంటికి చేరుకోకపోవడంతో సుదర్శన్ రెడ్డి సోమశిల వెనుకవైపు ఉన్న సగిలేరు నది ప్రాంతానికి వెళ్లాడు.నదిని దాటే ప్రయత్నంలో సుదర్శన్ రెడ్డి బురదలో కూరుకుని ఒడ్డుకు రాలేకపోయారు.అతని వెంట వెళ్లిన మరో ఇద్దరు అతికష్టంమీద ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నా,సుదర్శన్ రెడ్డి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు.డిగ్రీ చదివిన సుదర్శన్ రెడ్డి మృతిచెందడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ ప్రమాద ఘటనపై అట్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సగిలేరు నది బురదలో చిక్కుకుని ఓ వ్యక్తి మృతి - కడప జిల్లా
కడప జిల్లా అట్లూరులో ఘోరం జరిగింది. గేదెల కోసం వెతుక్కుంటూ వెళ్లి ఓ యువకుడు, సగిలేరు నదిలో చిక్కుకుని మృతిచెందాడు.
సగిలేరు నది దాటుతూ...తిరిగిరాని లోకాలకు వెళ్లిన కడప జిల్లా వాసి