కడప జిల్లా గోపవరం మండలం సోమశిల ముంపు గ్రామమైన సూరేపల్లి గ్రామాన్ని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య, రాజంపేట ఆర్డీఓ ధర్మా చంద్రారెడ్డి పర్యటించారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్న నేపథ్యంలో కడపలో వరద తాకిడి అధికంగా ఉందని... వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలను సూచించారు. గ్రామస్థులంతా వరద నష్ట పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్లే వెంటనే చెల్లించాలని అధికారులకు సూచించారు. గంట గంటకు పెరుగుతున్న సోమశిల వెనుక జలాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
సురక్షిత ప్రాంతాలకు సోమశిల ముంపు ప్రాంత ప్రజలు - సోమశిల ముంపు గ్రామాలు
కడప జిల్లా సోమశిల ముంపు గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.
సోమశిల ముంపు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు