ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీసుల కోసం ఓ ఔషధ దుకాణం..!

By

Published : Jun 3, 2020, 5:19 PM IST

తమ శాఖ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఔషధ దుకాణాన్ని ప్రారంభించారు జిల్లా పోలీస్​ అధికారి అన్బురాజన్​. ఇక్కడ పోలీసులకు అతి తక్కువ ధరలకు నాణ్యమైన మందులు విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.

Opening of a drug store in the Police Department
పోలీస్ శాఖలో ఔషధ దుకాణం ప్రారంభం


పోలీస్ సంక్షేమానికి కడప జిల్లా పోలీస్ అధికారి అన్బురాజన్ మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలతో ముందంజలో ఉన్న జిల్లా పోలీసులు... ఔషధ దుకాణాన్ని ప్రారంభించి సంక్షేమంలో మరో మెట్టు ఎక్కారు. ఇక్కడ పోలీసులకు బయట దొరికే ధరల కన్నా అతి తక్కువ ధరలకు నాణ్యమైన మందులను విక్రయిస్తామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఔషధ షాపును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క పోలీసు ఈ ఔషధ దుకాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి..

ఈ క్వారంటైన్ కేంద్రంలో శుభ్రతే లేదు..!

ABOUT THE AUTHOR

...view details