కడప జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లి శివారు ప్రాంతంలో అత్యంత పురాతన కాలం నాటి ఆలయం బయటపడింది. దట్టమైన కంపచెట్ల మధ్య ఉన్న ఈ ఆలయం రాజుల కాలం నాటిదని స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో బుచ్చి రామన్న పల్లె అనే గ్రామం ఉండేదని, కొంత కాలానికి గ్రామస్థులు మరోచోట రెడ్డి పల్లి గ్రామాన్ని నిర్మించుకున్నారని స్థానికులు తెలిపారు. ఆలయం అలాగే ఉందని, రాజుల కాలంలో నిర్మించిన ఈ శివాలయంలో గుప్త నిధుల కోసం శివలింగంతోపాటుగా వివిధ దేవతా మూర్తుల విగ్రహాలను తొలగించి పక్కన పెట్టారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి తవ్వకాలు జరిపితే ఆనాటి చరిత్ర వెలుగు చూసే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పురావస్తు శాఖ అధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆలయాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.
కడపలోని రెడ్డిపల్లిలో బయటపడిన పురాతన శివాలయం - Shiva temple find out at kadapa reddypalli news update
కడప జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లి శివారు ప్రాంతంలో పురాతన కాలం నాటి శివాలయం బయటపడింది. గుప్త నిధుల కోసం దుండగులు శివుడి విగ్రహంతోపాటుగా వివిధ దేవతామూర్తుల విగ్రహలను తొలగించి పక్కన పెట్టారు.
రెడ్డిపల్లిలో బయటపడ్డ పురాతన శివాలయం