ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రక్త శుద్ధికి పెద్ద యుద్ధమే

By

Published : Apr 25, 2020, 12:18 PM IST

వారానికి మూడు రోజులు తప్పకుండా డయాలసిస్​ చేయించుకోకపోతే నడవదు. ఆసుపత్రికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదు.. ఆటోనే అంబులెన్స్​ చేసుకున్నాడు కడప జిల్లా రాజంపేటకు చెందిన ఓ వృద్ధుడు.

old man difficulties for dialysis  at kadapa district
కడపలో కిడ్ని వ్యాధిగ్రస్తుల కష్టాలు

ఓపిగ్గా కూర్చునే శక్తి లేదు.. నడుం వాలుద్దామంటే స్థలం చాలదు. ఆటోనే అంబులెన్స్‌ చేసుకుని ఓ వృద్ధుడు సుమారు 120 కి.మీ. దూరం ప్రయాణిస్తున్నారు. వారానికి మూడు రోజులు తప్పనిసరిగా డయాలసిస్‌ చేయించుకోవాల్సిన రమణయ్య (60) దీనావస్థ ఇది. లాక్‌డౌన్‌ వల్ల బస్సులు లేక ఆటోలో కడప జిల్లా రాజంపేట నుంచి తిరుపతి స్విమ్స్‌కు ఆయన వస్తున్నారు. దీని కోసం రోజూ ఆటోకు రూ.1500 ఖర్చవుతోందని వాపోయారు. ఇతర ఖర్చులు అదనమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details