ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ నిర్మాణాలపై.. అధికారుల ఉక్కుపాదం

రాయచోటిలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టారు. 50 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్న ఓ ప్రాంతానికి ఇవాళ మోక్షం కలిగించారు. భారీ బందోబస్తు మధ్య అక్కడి నిర్మాణాలను తొలగించారు.

అక్రమ నిర్మాణాల తొలగింపు

By

Published : Oct 28, 2019, 5:58 PM IST

అక్రమ నిర్మాణాల తొలగింపు

కడప జిల్లా రాయచోటి పురపాలికలోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను ఇవాళ అధికారులు తొలగించారు. పట్టణంలోని జాతీయ రహదారి నుంచి గున్నికుంట్ల వెళ్లే రోడ్డు 50 ఏళ్లుగా ఆక్రమణలో ఉంది. రహదారి ఏర్పాటు చేయాలని స్థానికులు.. పురపాలక అధికారులు, పాలకుల దృష్టికి తీసుకురావటంతో ఆ ప్రాంతాన్ని సర్వే చేయించారు. జాతీయ రహదారి నుంచి ఎస్.ఎన్ కాలనీ వరకు 18 అడుగుల రహదారి ఆక్రమణలో ఉన్నట్లు రికార్డుల్లో తేలింది. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి ఆరు నెలల కిందట అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. అయినప్పటికీ ఎవరు ఖాతరు చేయలేదు. ఎట్టకేలకు పురపాలిక అధికారులు ఇవాళ భారీ బందోబస్తు మధ్య జేసీబీతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి రహదారి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అక్రమ నివాసాల యజమానులు ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సుధాకర్​, పురపాలిక కమిషనర్ మల్లికార్జున హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలోని కొత్తపేట, గాలివీడు రోడ్లలో కూడా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపడతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details