నివర్ తుపాను ప్రభావంతో.. రాను రాను చేను ఎర్రగా మారింది. చివరికి కోత ఖర్చులు కూడా రావని భావించిన కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నంది గ్రామానికి చెందిన రైతు వై.వెంకట నారాయణ సోమవారం పంటకు నిప్పుబెట్టాడు. సాగుకు అయిన పెట్టుబడి రాక అప్పులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నివర్.. చి'వరి'కి నిండా ముంచింది..! - కడపలో నివర్ తుపాను ప్రభావం వార్తలు
గత ఏడాది నివర్ తుపాను సమయంలో పొట్టదశలో ఉన్న వరి కొంతవరకు దెబ్బతింది. ఆ తర్వాత కొద్దిగానైనా పంట దక్కుతుందని ఆశపడి ఇప్పటివరకూ ఎదురుచూశాడు ఆ రైతు. చివరికి నిప్పు పెట్టాడు.
nivar effect on farmers in kadapa