హత్యాయత్నం కేసులో తొమ్మిది మంది నిందితులను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక డీఎస్పీ సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈశ్వర్‌రెడ్డి నగర్‌కు చెందిన మెరువ పెద్ద వెంకట సుబ్బయ్య, అతని తమ్ముడి కుమారుడు హరి మధ్య కొంతకాలంగా స్థలవివాదం నడుస్తోంది. తన తాత తీర్మాణం చేసిన మేరకు అక్కదేవతల గుడి ఆవరణలో తనకు స్థలం ఇవ్వాలని వెంకట సబ్బయ్యను హరి ఇబ్బంది పెట్టేవాడు. దీనికి వెంకట సుబ్బయ్య కుమారుడు వేణు అడ్డుపడేవాడు. దీంతో వేణును హతమారిస్తే అడ్డుతొలుగుతుందని భావించిన హరి... ఈ నెల 24న కొంత మందితో కలిసి కత్తులతో వేణుపై దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వేణును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు కాగా...ఆర్టీపీపీ వద్ద నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కత్తులతో పాటు నాలుగు ద్విచక్రవాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.
హత్యాయత్నం కేసులో 9 మంది అరెస్టు..మారణాయుధాలు స్వాధీనం ! - హత్యాయత్నం కేసులో 9 మంది అరెస్టు..మారణాయుధాలు స్వాధీనం
స్థల వివాదంతో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన 9 మంది నిందితులను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కత్తులు వాహనాలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
హత్యాయత్నం కేసులో 9 మంది అరెస్టు