కడప జిల్లా రాయచోటి మండలం మాసాపేటలో కొవిడ్‌తో మరణించిన ఓ వృద్ధురాలికి పురపాలక సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. కరోనా సోకి పది రోజులుగా చికిత్స పొందిన ఆ వృద్ధురాలు నిన్న మృతి చెందారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులెవరూ ముందుకు రాలేదు.
స్థానికులు పురపాలక అధికారులకు సమాచారం అందించారు. కమిషనర్ రాంబాబు వెంటనే స్పందించారు. కార్యాలయ సహాయకుడు మల్లికార్జున, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.