కడప జిల్లా అట్లూరు మండలంలోని వరికుంట దళితవాడకు చెందిన భూములను, ఇళ్లను సోమశిల జలాశయ నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంది. వారికి 2009లో ప్రభుత్వం అరకొరగా పరిహారం అందించింది. 110 కుటుంబాలకు ఈ గ్రామానికి కొంత దూరంలో పునరావాసం కోసం స్థలం సేకరించారు. 2010లో పనులు మొదలుపెట్టి... కొన్ని రోజులకే అర్ధంతరంగా ఆపేశారు. దశాబ్ద కాలంగా ఈ కాలనీ వాసులు కనీస సౌకర్యాలు లేక దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా నూతనంగా ఎన్నికైన పాలకులు పునరావాసం కల్పించి తమను ఆదుకోవాలని వరికుంట దళిత కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దశాబ్ద కాలంగా లేని పునరావాసం.. సమస్య తీరేదెన్నడు? - సోమశిల జలాశయ నిర్మాణం
ప్రాజెక్టు కోసం సొంత భూములు వదులుకున్నారు. పునరావాసం కోసం దిశగా అధికారులు హామీ తీర్చని కారణంగా.. దశాబ్దం నుంచి నిలువ నీడ లేక ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమ సమస్య తీర్చాలని కడప జిల్లా సోమశిల ముంపు బాధితులు కోరుతున్నారు.
ఎన్నాళ్లీ...ముంపు ఆశలు!