కడప జిల్లా శంకరాపురంలో నివాసం ఉన్న తల్లీ, బిడ్డ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడపకు చెందిన శ్రావణికి శివకుమార్ రెడ్డితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె తన్విక ఉంది. శివకుమార్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
కుమార్తె తన్వికతో కలిసి శంకరాపురంలోనే శ్రావణి నివాసం ఉండేది. గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం శ్రావణి తన కుమార్తెతో కలిసి పడక గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.