ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడాది పాలన పూర్తిస్థాయిలో విఫలమైంది: ఎమ్మెల్సీ బీటెక్ రవి

వైకాపా సంవత్సరం పాలన పూర్తిస్థాయిలో విఫలమైందని ఎమ్మెల్సీ బీటెక్​ రవి విమర్శించారు. జగన్​ ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కానీ ఏ ఒక్కరికి సరైన న్యాయం జరగలేదన్నారు.

ఏడాది పాలన పూర్తిస్థాయిలో విఫలమైంది:  ఎమ్మెల్సీ బీటెక్ రవి
ఏడాది పాలన పూర్తిస్థాయిలో విఫలమైంది: ఎమ్మెల్సీ బీటెక్ రవి

By

Published : Jun 12, 2020, 11:49 AM IST

ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బీటెక్​ రవి మండిపడ్డారు. జగన్​ ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని సర్కార్ సంబరాలు చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. కానీ ఏ ఒక్క లబ్ధిదారునికి సరైన న్యాయం జరగలేదన్నారు. రంగుల విషయంలో హైకోర్టు అక్షింతలు వేసినప్పటికీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. దీనిపై జగన్​ తప్పు ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని బీటెక్ రవి అన్నారు. భారతదేశ చరిత్రలోనే హై కోర్టు ద్వారా ఇన్ని సార్లు అక్షింతలు వేసిన ముఖ్యమంత్రి జగన్ ​తప్ప వేరే వారు లేరన్నారు. అన్నా క్యాంటీన్లు మూసేశారు. చంద్రన్న బీమాను తొలగించారు. సంవత్సరం పాలన పూర్తిస్థాయిలో విఫలమైందని ఆరోపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details