ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులే కాక వారి కుటుంబ సభ్యులూ ప్రచార పర్వంలో దూకుడు పెంచారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి సతీమణి అరుణ, ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి లింగారెడ్డి సతీమణి లక్ష్మీ ప్రసన్న ప్రొద్దుటూరులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మళ్లీగెలిపించాలని కోరారు. ఐదేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకువివరించారు.