కడప జిల్లా మైదుకూరులో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి పురపాలక వార్డు బాటను చేపట్టారు. వీధుల్లో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు కమిషనర్ పీవీ రామకృష్ణ, ఇంజనీరింగ్ అధికారి మధుసూదన్ బాబు, పట్టణ ప్రణాళిక అధికారి జిలానిబాషా, వాలంటీర్లు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి సమస్యలపై తక్షణ పరిష్కారం అవసరమని ఎమ్మెల్యే రఘురాం రెడ్డి చెప్పారు. ఈ దిశగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆయన వెల్లడించారు.
పురపాలక బాట పట్టిన మైదుకూరు ఎమ్మెల్యే - maidukuru
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పురపాలక వార్డు బాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, అధికారులు, వాలీంటర్లు పాల్గొన్నారు.
mla raghuramreddy visited maidukuru municipality at kadapa district.