ఆంధ్రప్రదేశ్

andhra pradesh

2200 కుటుంబాలకు కూరగాయల పంపిణీ

By

Published : Apr 26, 2020, 12:43 AM IST

కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో 2200 నిరుపేద కుటుంబాలకు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కూరగాయలు పంపిణీ చేశారు. రంజాన్ మాసంలో ముస్లింలు తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.

essential goods distributed to people in kadapa
పేదలకు మంత్రి అంజద్ బాషా కూరగాయలు పంపిణీ

కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్​ బాషా పేర్కొన్నారు. కడప జిల్లాలోని మాసాపేట, బిస్మిల్లా నగర్​లో నిరుపేదలకు ఆయన కూరగాయలు పంపిణీ చేశారు. మాసాపేటలో 1500 కుటుంబాలకు, బిస్మిల్లా నగర్​లో 700 కుటుంబాలకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా మాసాపేటలో డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరోనా వైరస్​ను దృష్టిలో ఉంచుకొని ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని అంజాద్ బాషా సూచించారు. ప్రతి మసీదుకు ఐదుగురు మాత్రమే వెళ్లి ప్రార్థనలు చేసుకోవాలని చెప్పారు. ముస్లింలందరూ కరోనాను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో ప్రజారోగ్య కార్మికులు, సిబ్బందికి జాయింట్ కలెక్టర్ గౌతమి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details