కడప జిల్లా పొద్దుటూరులోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. కొన్ని పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా కాని కారణంగా... పులిహోర, టమాటా పప్పు వడ్డించారు. మరి కొన్ని పాఠశాలల్లో గుడ్లు ఆలస్యంగా పంపిణీ చేశారు. అందువల్ల 20 నిమిషాలు ఆలస్యంగా విద్యార్థులకు భోజనం అందించారు. దొరసానిపల్లె ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి సావిత్రమ్మ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. గుడ్లు సరఫరా చేయకపోవడంపై.. ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడి గుడ్లను తెప్పించారు. వాటిని ఉడికించి విద్యార్థులకు ఇచ్చేంతవరకు ఏమ్ఈఓ పాఠశాలలోనే ఉన్నారు. నిన్నటి వరకు సంక్రాంతి సెలవులు ఉన్న కారణంగా కోడి గుడ్ల సరఫరా అన్ని పాఠశాలలకు కాలేదని, రేపటి నుంచి అన్ని బడుల్లో కోడిగుడ్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన మెనూ ప్రకారం భోజనం - ప్రభుత్వ పాఠశాలల్లో నూతన మెనూ ప్రకారం భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన మెనూ ప్రకారం భోజనం ప్రారంభమైంది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే మధ్యాహ్న భోజన పథకంలో.. ప్రభుత్వ సూచన మేరకు మార్పులు చేశామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నూతన మెనూ ప్రకారం భోజనం