ETV Bharat / state

విదేశీ ఫలాలు.. ఆరోగ్యానికి సోపానాలు..! - different fruits business in kadapa district

రోజూ ఒక ఆపిల్​ తింటే ఇక డాక్టర్​ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటారు. క్రమం తప్పకుండా పండ్లు తీసుకుంటే మనం ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటామనేది కాదనలేని నిజం. దేశవాళీ పండ్లే కాకుండా ఇప్పుడు ప్రజలు విదేశీ పండ్లపై ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. వీటిలో ఔషధ గుణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఆక‌ర్షించే రంగు.. అంత‌కంటే మిన్న‌గా కొత్త‌ద‌నం.. నోరూరించే రుచుల సమ్మేళనం.. క‌ల‌గ‌ల‌సిన విదేశీ పండ్లు ఇప్పుడు సిరిపురి విప‌ణిని ముంచెత్తుతున్నాయి. జ‌పాన్‌, ఇరాన్‌, ద‌క్షిణాఫ్రికా, ఇట‌లీ త‌దిత‌ర దేశాల్లో పండే ఫలాలు కడ‌ప జిల్లా  ప్రొద్దుటూరులోనూ అందుబాటులోకి వచ్చాయి.

విదేశీ ఫలాలు.. ఆరోగ్యానికి సోపానాలు..!
విదేశీ ఫలాలు.. ఆరోగ్యానికి సోపానాలు..!
author img

By

Published : Dec 16, 2019, 1:01 PM IST

Updated : Dec 26, 2019, 2:39 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఖ‌లంద‌ర్ దాదాపు 10 ఏళ్ల నుంచి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అంద‌రికంటే భిన్నంగా వ్యాపారం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ఆయ‌న కొత్త రకం పండ్ల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. విదేశాల్లో పండే పండ్ల‌ను దిగుమ‌తి చేసుకుని విక్ర‌యిస్తున్నాడు. చెన్నై, బెంగుళూరు నుంచి విదేశీ పండ్ల‌ను ప్రొద్దుటూరుకి తెచ్చి అమ్ముతున్నారు. వీటికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండడం వల్ల రెండు రోజులకోసారి పండ్లను తెప్పించి విక్రయిస్తున్నారు. ఫలాలు చెడిపోకుండా భద్రపరిచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ‌తంలో గ‌ల్ఫ్​లో ప‌నిచేసిన ఖ‌లంద‌ర్ అక్క‌డ పండే పండ్ల‌ను ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తే వ్యాపారం బాగుంటుంద‌నే న‌మ్మ‌కంతోనే వాటిని విక్ర‌యిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

అన్ని విదేశీ ఫలాలు అందుబాటులో

రామ‌సీతా ఫ‌లం, కివీ, అమెరిక‌న్ ఆపిల్‌, రాయ‌ల్‌గ‌ల‌, గ్రీన్ ఆపిల్‌, పియ‌ర్స్‌, లిచీ, ఎర్ర‌దాక్ష‌, ఇలా అన్ని ర‌కాల విదేశీ పండ్ల‌ను ఖ‌లంద‌ర్ విక్రయిస్తున్నాడు. సాధారణంగా మన ప్రాంతాల్లో సీతాఫలం లభ్యమైనా రామసీతాఫలం ఇక్కడ పండదు. జపాన్​ ఆపిల్​ను చాలా తక్కువ మంది చూసుంటారు. అంతే కాకుండా లాంగ‌ర్ పండు, గ్రీన్ ఆపిల్‌, ఎర్ర డ్రాగెన్‌, ఎరుపు రంగు కివీ ఇలా 20 ర‌కాల విదేశీ పండ్ల‌ను ఖ‌లంద‌ర్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చారు.. వీటిని తీసుకుంటే ఆరోగ్యం మెరుగ‌వుతుంద‌నే ఉద్దేశంతో వైద్యులు కూడా ఈ పండ్ల‌ను కొనుగోలు చేస్తున్న‌ట్లు ఖలందర్​ తెలిపారు. భ‌విష్య‌త్తులో ఇక్కడి ప్రజలకు మ‌రిన్ని కొత్త‌ ర‌కం పండ్లను ప‌రిచ‌యం చేస్తాన‌ని.. చెబుతున్నారు.

ప్రజలకు అందుబాటులో విదేశీ ఫలాలు తీసుకొచ్చిన వ్యాపారి

ఇదీ చూడండి:

విదేశీ కొలువు వదిలి.. చిరుధాన్యాల సాగు పట్టి..

Intro:నోట్: ఈ స్టోరీకి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్ టీ పీ ద్వారా పంపడమైంది... గమనించగలరు... ధన్యవాదాలు..

ap_cdp_41_16_videshi_pandlu_pasandu_vo_pkg_ap10041
place: proddatur
reporter: madhusudhan

Body:ఆ

Conclusion:ఆ
Last Updated : Dec 26, 2019, 2:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.