భార్యతో ఘర్షణ పడి ఆత్మహత్యకు పాల్పడిన భర్త
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య - కడప జిల్లా రాజంపేటలో వ్యక్తి బలవన్మరణం
భార్య, భర్తల మధ్య జరిగిన చిన్న గొడవ భర్త ఆత్మహత్యకు దారి తీసింది. అభం శుభం తెలియని ఏడాది బిడ్డకు తండ్రి లేకుండా చేసింది. కడప జిల్లా రాజంపేట పట్టణం బోయపాలెంలో శేఖర్ రెడ్డి, కుమారి గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన భర్త శేఖర్ రెడ్డి.. ఇంట్లో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య man suicideds at rajampeta in kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6029376-1019-6029376-1581386135603.jpg)
భార్యతో ఘర్షణ పడి ఆత్మహత్యకు పాల్పడిన భర్త