ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తికమాసం తొలి సోమవారం- శివాలయాల్లో పోటెత్తిన భక్తులు - కార్తీక స్నానాలు న్యూస్

Lord Shiva Pooja in Karthika Masam: కార్తికమాసం మొదటి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలు దీపాల కాంతులతో దేదీప్యమానంగా కాంతులీనుతున్నాయి.

Lord_Shiva_Pooja_in_Karthika_Masam
Lord_Shiva_Pooja_in_Karthika_Masam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 10:56 AM IST

దీపాల కాంతులతో కార్తీకమాసం తొలి సోమవారం- శివాలయాల్లో పోటెత్తిన భక్తులు

Lord Shiva Pooja in Karthika Masam: కార్తికమాసం తొలి సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు ప్రత్యేక పూజల అనంతరం దీపారాధన చేశారు. కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని పవిత్ర గోదావరిలో తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

Karthika Masam Pooja Vidhanam: రాజమహేంద్రవం పుష్కరఘాట్‌కు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం దీపాలు వెలగించి ప్రత్యేక పూజలు చేశారు. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని పంచరామక్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో దీపాలు వెలిగించి భక్తుల పూజలు చేశారు.

స్వామివారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. కోనసీమ జిల్లా మురమళ్లలో శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, ముమ్మిడివరంలోని శ్రీ ఉమాసూరేశ్వర స్వామి, కుండళేశ్వరంలోని శ్రీ పార్వతీ కుండలేశ్వరస్వామి ఆలయాల్లో వేకువజామునుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. యానంలోని గౌతమి నదిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు చేసి దీపారాధన చేస్తున్నారు.

Karthikamasam: కార్తికమాసం తొలి సోమవారం.. భక్తులతో సందడిగా శైవక్షేత్రాలు

Karthika Masam 2023: అన్నమయ్య జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. రైల్వే కోడూరులోని భుజింగేశ్వరస్వామి దేవాలయంలో శివునికి అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో కార్తిక దీపాలు వెలిగించారు. కార్తికమాసం తొలి సోమవారం సందర్భంగా బాపట్లజిల్లాలోని.. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

చీరాలలోని భ్రమరాంబికామల్లీశ్వరస్వామి, పేరాలలోని పుణుగు రామలింగేశ్వరస్వామి దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే గరళకంఠునికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. శివయ్య దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. మహిళలు ఆలయప్రాంగణంలో కార్తికదీపాలు వెలిగించారు. ఆలయప్రాంగణం శివనామస్మరణతో మార్మోగిపోయింది.

Karthika Masam Special: కార్తికమాసం మొదటి సోమవారం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జిల్లాలోని ఉండ్రాజవరంలో వేంచేసి ఉన్న శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో మొదటి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు.

Kartikamasam: కార్తికమాసం ప్రారంభ వేళ... భక్తుల సందడి

కార్తిక సోమవారం పర్వదినం సందర్భంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని శివాలయం శివనామస్మరణతో మార్మోగింది. గోష్ప్రద క్షేత్రం భక్తుల తాకిడితో కిటకిటలాడింది. పుణ్య నది స్థానాల చేసేందుకు భక్తులు పోటెత్తారు. సుందరీ సమేత సుందరేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, లలితా సహస్త్రనామార్చన, పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

Karthika Deepam: కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా కర్నూలులోని శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, మాల ధరించిన స్వాములు దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని కైలాసగిరి క్షేత్రంలో శివునికి అభిషేకాలు చేశారు. కార్తికమాసం సందర్భంగా మహిళలు సూర్యోదయానికి ముందేదీపాలు వెలిగించి పూజలు చేశారు.

విజయవాడలో లక్షదీపార్చన... తరలివచ్చిన భక్తజనం

ABOUT THE AUTHOR

...view details