ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో సినీఫక్కీలో చోరీ- అన్నీ అనుమానాలే

50 లక్షలు విలువ చేసే కనకపుష్యరాగాన్ని కొనుగోలు చేస్తామని నమ్మించిన ఇద్దరు వ్యక్తులు... ఖాదర్‌ బాషాపై దాడి చేసి రాయిని అపహరించారు. ఈ ఘటన కడప  రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కనకపుష్యరాగం స్టోన్ అపహరణ
కనకపుష్యరాగం స్టోన్ అపహరణ

By

Published : Jan 17, 2020, 7:03 PM IST

కడప నగరంలోని చిలుకలబావికి చెందిన ఖాదర్‌ బాషా... తన వద్ద ఉన్న కనకపుష్య రాగం అమ్మాలనుకున్నాడు. కర్ణాటక చెందిన వజ్రాల వ్యాపారి, ఇంకో వ్యక్తితో ఆదిత్య లాడ్జిలో బేరాన్ని కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేసి ఆ స్టోన్​ లాగేసుకున్నారు. తర్వాత స్నానాల గదిలో బంధించారు. కొన్ని గంటల తర్వాత కట్లు విప్పుకున్నబాధితుడు... పోలీసులకు సమాచారమిచ్చాడు. గాయాలపాలైన ఖాదర్‌ బాషాను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కనకపుష్యరాగం స్టోన్ అపహరణ

ABOUT THE AUTHOR

...view details