నాలుగో దశ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్న పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని... కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ సూచించారు. ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా... 21వ తేదీ ఉదయం నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల లోపు జన సమూహం లేకుండా చూడాలని, బ్యానర్స్ కు అనుమతి లేకుండా చూడాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.
'ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి' - kadapa-district latest news
నాలుగోదశ ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో పోలింగ్ జరగనుంది. పులివెందుల నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ సూచించారు.
కడప జిల్లాలో ఎన్నికలు