ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కారులో నగలు, నగదు చోరీ.. 6 గంటల్లో ఛేదించిన పోలీసులు

By

Published : Jun 16, 2020, 12:30 PM IST

కడప జిల్లాలో కారులోంచి 18 తులాల బంగారం, 15 వేల రూపాయల నగదు చోరీకి గురైన కేసును పోలీసులు ఆరు గంటల్లోనే చేధించారు. సీసీ టీవీ ఫుటేజ్​ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

police chaged theft case in six hourse
ఆరు గంటల్లో చోరీ కేసును చేధించిన పోలీసులు

దొంగతనం జరిగిన ఆరు గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు. దొంగను పట్టుకుని బంగారు నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​కు చెందిన శంకర్ రెడ్డి.. కడపలో వారి బంధువుల వివాహానికి వచ్చారు. మంగళవారం తిరిగి హైదరాబాద్​కు తన వాహనంలో బయలుదేరారు. కడప శివారులో విజయదుర్గ ఆలయం వద్ద కారు ఆపి దర్శనం కోసం వెళ్ళారు.

కారు తలుపు ఒకటి సరిగా మూత పడని విషయాన్ని గ్రహించని ఓ దొంగ.. అందులోని బ్యాగ్ దొంగిలించాడు. శంకర్​ రెడ్డి తిరిగి వచ్చి చూడగా బ్యాగ్ కనిపించలేదు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి దొంగను పట్టుకున్నారు. అతడి నుంచి 18 తులాల బంగారు నగలు, 15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details