కడప కలెక్టర్ హరికిరణ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్టు చేశారు.
తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని హరికిరణ్ వెల్లడించారు. వారం, పది రోజుల నుంచి తనతో దగ్గరగా కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.