ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమలాపురం అభివృద్ధికి కృషిచేస్తా: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ - కడప జిల్లా

కడప జిల్లా కమలాపురం పట్టణంలోని స్థానిక సీఎస్ఐ చర్చిని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ సందర్శించారు. కమాలాపురం అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ను సన్మానిస్తున్న చర్చి సభ్యులు

By

Published : Aug 5, 2019, 2:56 PM IST

కమలాపురం పట్టణంలోని స్థానిక సీఎస్ఐ చర్చిని సందర్శించిన ఎమ్మెల్యేని చర్చి కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మాట్లాడుతూ....కమలాపురం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. పట్టణంలో మౌలిక వసతులైన డ్రైనేజీ వ్యవస్థ , ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తానని హామీఇచ్చారు.పట్టణానికి ఉన్నత విద్యను బోధించగల అత్యున్నత కళాశాలలను తీసుకొస్తానని అంతేకాక స్థానిక ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిగా మారుస్తానని తెలిపారు.

ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ను సన్మానిస్తున్న చర్చి సభ్యులు

ABOUT THE AUTHOR

...view details