ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరులో అక్రమంగా గడ్డి మందు అమ్మకాలు

ప్రభుత్వం నిషేధించిన గడ్డిమందును పలుచోట్ల అక్రమంగా అమ్ముతున్నారు. కడప ప్రొద్దుటూరులోని ఓ దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్న 50,900 రూపాయలు విలువచేసే 436 గడ్డి ముందు ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ షాపు యాజమాని, డీలర్​పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు.

ప్రొద్దూటుూరులో అక్రమంగా గడ్డి మందు అమ్మకాలు
ప్రొద్దూటుూరులో అక్రమంగా గడ్డి మందు అమ్మకాలు

By

Published : Aug 13, 2020, 9:14 AM IST

Updated : Aug 13, 2020, 9:28 AM IST

ప్రొద్దూటుూరులో అక్రమంగా గడ్డి మందు అమ్మకాలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ ఎన్ఫో​ర్స్ మెంట్ అదనపు ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు సీఐ సప్తగిరి బాబు, ఏవో శివశంకర్​రెడ్డి దాడులు చేశారు. పట్టణంలోని సూర్య ట్రేడర్స్​లో తనిఖీ చేయగా ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందు అమ్ముతున్నట్లు గుర్తించారు. 50, 900 రూపాయలు విలువచేసే 436 గడ్డి ముందు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యజమాని వినోద్ కుమార్, కర్నూలు జిల్లా అవుకుకు చెందిన డీలర్ నాగరాజులపై చర్యలు తీసుకోవాలని స్థానిక రెండో పట్టణ ఠాణాలో అధికారులు ఫిర్యాదు చేశారు.

Last Updated : Aug 13, 2020, 9:28 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details