ప్రైవేటు ఆస్పత్రికి ధీటుగా రాజంపేట వైద్యశాలను అభివృద్ధి చేస్తాం - kadapa
ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా రాజంపేట వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని ఆస్పత్రి కమిటీ ఛైర్మన్ వడ్డే రమణ తెలిపారు.
కడప జిల్లా రాజంపేట ఆస్పత్రిని అత్యాధునికంగా అభివృద్ధి చేస్తామని ఆస్పత్రి కమిటీ ఛైర్మన్ వడ్డే రమణ తెలిపారు. సూపరింటెండెంట్ సాధిక్ అధ్యక్షతన సోమవారం కమిటీ సమావేశం జరిగింది. ఆసుపత్రికి సంబంధించి 9 లక్షల 50 వేల రూపాయలు నిధులు ఉన్నాయని, వీటితో వివిధ పనులు చేపడతామన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కడా లేని విధంగా సీమాంక్ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు కోసం ఏసీ లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆసుపత్రి ఆవరణాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దుతామని, ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకలకు స్థాయిని పెంచుతున్నామని చెప్పారు. ట్రామా కేర్ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే మేడ మల్లికార్జునరెడ్డి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు.