కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమడక చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రూ. 6 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక రాష్ట్రం నుంచి గుట్కాను అక్రమంగా తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. నిషేదిత వస్తువులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
రూ.6 లక్షల విలువైన గుట్కా పట్టివేత ! - 6 లక్షల విలువైన గుట్కా పట్టివేత
ఆటోలో అక్రంగా తరలిస్తున్న రూ.6 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను కడప జిల్లా దువ్వూరు పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఆటో సీజ్ చేశారు.
రూ.6 లక్షల విలువైన గుట్కా పట్టివేత !