కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని గండికోట ఆగ్నేయ భాగంలో కోటగోడ వద్ద రాయల్ చెరువు ఉంది. ఈ చెరువును పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించారు. ఈ చెరువును రాతి చెరువు, రాజుల చెరువు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. యుద్ధ సమయంలో కోట లోపల నుంచి దిగ్బంధం చేసిన సందర్భాల్లో నెలల తరబడి కోటలోని రాజు పరివారానికి, ఇతరులకు ఈ చెరువు నీరే అవసరాలను తీర్చేది. ఈ చెరువు నుంచి జుమ్మా మసీదు వరకు నీరు సరఫరా అయ్యేది. రాయల్ చెరువుకు తూర్పున నీటి గొట్టాల వ్యవస్థ నేటికి మనం చూడొచ్చు. కుతుబ్ షాహీ శైలిలో ఈ గొట్టాల వ్యవస్థ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
వేసవి వచ్చిన ఇక్కడ నీటి ఎద్దటి ఉండదు - గండికోట రాయల చెరువు తాజా న్యూస్
వేసవి కాలం వచ్చిందంటే చాలు నీళ్ల కోసం పరుగులు పెట్టాల్సిందే. ఏటా ప్రభుత్వాలు నీటి సంరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న సరే ఇబ్బందులు తప్పడంలేదు. కానీ వీటన్నిటికీ పూర్తి వ్యతిరేకం గండికోట రాయల చెరువు. సుమారు 869 ఏళ్ల చరిత్ర కలిగిన పర్యాటక కేంద్రం గండికోటలో రాయల చెరువు నేటికీ నీటితో కళకళలాడుతుంది. ఆనాటి గండి కోట రాజులు నీటి సంరక్షణ చర్యలు చేపట్టడానికి ఇదొక చక్కటి నిదర్శనంగా నిలుస్తోంది.
నీటితో కళకళలాడుతున్న గంటికోట రాయల చెరువు
ఆనాటి రాజులను స్ఫూర్తిగా తీసుకొని 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఏటా వేసవికాలంలో జలసంరక్షణ పనులను ఉద్యమంలా చేపడుతున్నారు. ప్రభుత్వాలు రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని నీటి సంరక్షణ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: గండికోటలో.. అందుబాటులోకి సాహస క్రీడల అకాడమీ