ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గండికోట ఘనచరిత

చారిత్రక వైభవానికి సజీవసాక్ష్యం గండికోట...అద్భుత శిల్పకళకు నిలయం...చుట్టూ లోయలు..మధ్యలో పెన్నానది ప్రవాహం...సందర్శకులను ఎంతోగానో ఆకట్టుకునే ఈ గండికోట విశిష్టతను నేటి తరానికి తెలియజేసేందుకు వారోత్సవాలు నిర్వహిస్తోంది ఏపీ సర్కారు.

By

Published : Feb 7, 2019, 6:35 AM IST

గండికోట ఉత్సవాలు

కడప చరిత్రకు సజీవసాక్ష్యం గండికోట ...అద్భుతశిల్పకళకు పెట్టింది పేరు...ఒక వైపు పెన్నానది ప్రవాహం...మరోవైపు శత్రుదుర్భేద్యమైన కోట దుర్గం..మతసామరస్యానికి ప్రతీక...చూపరులకు రెండు కళ్లు చాలవే అన్నట్లు అన్పించే శిల్పకళా కావ్యం..వందల ఏళ్లు చరిత్ర కలిగిన ఈ కట్టడం విశిష్టతను తెలియజేయడానికి గండికోట వారోత్సవాలు నిర్వహిస్తోంది ఏపీ సర్కారు.
గండికోట వైభవాన్ని చాటిచెప్పేలా కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో..ఈ నెల 9, 10 తేదీల్లో అంగరంగవైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలను ఉత్సవాల పట్ల అవగాహన కల్పించేందుకు విస్తృతం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజంపేటలో నిర్వహించిన ముందస్తు వేడుకలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు తమ విన్యాసాలతో అలరించారు. దేవతామూర్తుల వేషధారణలు, అలనాటి రాజుల వేషధారణ, కొయ్య బొమ్మ ఆట, స్టిక్ వాకింగ్, గిరిజన నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాటం, చెక్కభజనలతో ఆద్యంతం అలరించారు.
ప్రభుత్వ క్రీడామైదానంలో కడప విహాంగ్ అడ్వెంచర్ ఆధ్వర్యంలో... నిర్వహించిన పారా మోటర్ విన్యాసం ఆకట్టుకుంది. పారా మోటార్ ప్లైయింగ్ లో ఇద్దరు యువకులు కూర్చొని ఆకాశంలో చక్కర్లు కొట్టారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ మోడలింగ్ షో యువత, పిల్లలు, మహిళలను ఆకర్షించింది.

గండికోట ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details