కడప జిల్లా వెంగళాయపల్లె బాలుడి మృతి కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల 7న అదృశ్యమైన తనీష్ రెడ్డి నిన్న (సోమవారం) రాత్రి విగతజీవిగా వెంగళాయపల్లెలోని కంపచెట్లలో దొరికాడు.
వెంగళాయపల్లె బాలుడి మృతి కేసు..పోలీసుల అదుపులో ఐదుగురు - బాలుడి కిడ్నాప్
వెంగళాయపల్లె బాలుడి మృతి కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల 7న అదృశ్యమైన తనీష్రెడ్డి సోమవారం రాత్రి శవమై అదే ఊరిలోని కంపచెట్లలో దొరికాడు.
బాలుడి మృతి
రెండు రోజుల వ్యవధిలోనే అదృశ్యమైన బాలుడు అదే గ్రామంలో శవమై కనిపించడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తనీష్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. బాలుడిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:విషాదాంతం : అదృశ్యమైన బాలుడు మృతి