కడప జిల్లా లింగాల మండలం కర్ణ పాపయ్య గారిపల్లెకు చెందిన కర్ణ నరసింహారెడ్డి అనే యువ రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలంలో విషపు గుళికలు తిని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే రైతును పులివెందుల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరసింహారెడ్డి మృతిచెందాడు. మృతుడు ఆరు నెలల క్రితమే ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎక్కువకావటం వలన... అప్పు ఇచ్చిన వారు డబ్బు ఇవ్వమని అడగగా.. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య - loans
కడప జిల్లా కర్ణపాపయ్యగారిపల్లెలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
రైతు ఆత్మహత్య