కడప జిల్లా పులివెందుల మండలం చినరంగాపురానికి చెందిన రైతు బొగ్గుల పాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలో విషగుళికలు మింగి బలవన్మరణం చెందాడు. తనకున్న 9 ఎకరాల పొలంలో చీనీ నిమ్మ పంట సాగుచేశాడు. పెట్టుబడికి, బోర్లకు 8 లక్షల రూపాయలు అప్పుచేశాడు. లాక్ డౌన్ కారణంగా చేతికొచ్చిన పంటను అమ్ముకోలేకపోతున్నానే మనస్తాపంతో ఇంత పనికి ఒడిగట్టాడు. చేతికి వచ్చిన కాయలు కళ్లెదుటే రాలిపోవడం తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి పరామర్శించారు. రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
పంటను అమ్ముకోలేక.. అప్పులు తీర్చలేక.. రైతు బలవన్మరణం - కడప జిల్లాలో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. వైరస్ వ్యాప్తి నివారణ, ప్రజల క్షేమం కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కారణంగా.. అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి నష్టాలు భరించలేక చనిపోతున్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య