ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 పోటీలు..

ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 పోటీలు కడపలో కోలాహలంగా సాగుతున్నాయి. బ్యాట్స్​మెన్​ల దూకుడుతో మైదానమంతా హోరెత్తిపోతుంది. 12 జట్లు తలపడగా.. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈనాడు యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది.

enadu sports league -2019 games in kadapa
కడపలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 పోటీలు

By

Published : Dec 18, 2019, 7:22 PM IST

కడపలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 పోటీలు

కడప జిల్లాలో స్ప్రైట్, నారాయణ విద్యా సంస్థలు, దీక్ష అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 పోటీలు సందడిగా సాగుతున్నాయి. కడప కె.ఎస్.ఆర్.ఎం, కే.ఓ.ఆర్.ఎం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో క్రికెట్​ ​ పోటీలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. జూనియర్స్ విభాగంలో 12 జట్లు తలపడగా.. క్వార్టర్ ఫైనల్స్​కు పోటీలు జరుగుతున్నాయి. గురువారం నుంచి సీనియర్స్ విభాగంలో క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు జరిగిన పోటీల్లో క్రీడాకారులు మైదానమంతా పరుగుల వర్షం కురిపించారు. గెలుపు కోసం జట్లు నువ్వానేనా అన్న విధంగా పోటీపడ్డాయి. బ్యాట్స్మెన్లు బంతిని బౌండరీ లైన్ దాటించారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానం అంతా హోరెత్తిపోయింది. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈనాడు యాజమాన్యం అన్నిరకాల సౌకర్యాలను కల్పించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details