కడప కెఎస్ఆర్ఎం, కెఓఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు-ఈతరం క్లబ్, స్ప్రైట్, నారాయణ విద్యా సంస్థలు, దీక్ష అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. సీనియర్స్ విభాగంలో ఆరు జట్లు తలపడ్డాయి. మొదటి మ్యాచ్లో ప్రొద్దుటూరు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల జట్టుపై జమ్మలమడుగు శ్రీనివాస డిగ్రీ కళాశాల జట్టు గెలుపొందింది. చివరి ఓవర్లో శ్రీనివాస డిగ్రీ కళాశాలకు చెందిన ఫాజిల్ నాలుగు వికెట్లు తీయడంతో.. ఇంజినీరింగ్ కళాశాల జట్టు ఓటమి చవిచూసింది. గెలుపు కోసం క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఓ వైపు పరుగులు జోరు... మరోవైపు వికెట్ల పతనంతో పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈనాడు యాజమాన్యం అన్ని రకాల చర్యలు చేపట్టింది.
కడపలో రసవత్తరంగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు - ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 క్రికెట్ పోటీలు
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 క్రికెట్ పోటీలు కడపలో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మెుదటి మ్యాచ్లో జమ్మలమడుగు శ్రీనివాస డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది.

కడపలో రసవత్తరంగా ఈనాడు క్రికెట్ పోటీలు