ETV Bharat / sports

అదరగొడుతున్న ద్రవిడ్ తనయుడు - cricket news 2019

భారత దిగ్గజ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్​ కొడుకు సమిత్​ రాష్ట్రస్థాయిలో అదరగొట్టేస్తున్నాడు. తాజాగా అండర్​-14 క్రికెట్​లో డబుల్​ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. ఈ ద్విశతకం చేసేందుకు 256 బంతులు ఆడాడీ జూనియర్​ ద్రవిడ్​.

Rahul Dravid son Samit
రాహుల్​ ద్రవిడ్​ కొడుకు డబుల్​ సెంచరీ...
author img

By

Published : Dec 20, 2019, 7:11 PM IST

ప్రపంచ క్రికెట్​లో​ 'ది వాల్​' అనే బిరుదు తెచ్చుకున్న టీమిండియా ఆటగాడు రాహుల్​ ద్రవిడ్​. భారత జట్టుకు సారథిగా పనిచేసిన ఇతడు.. ప్రస్తుతం జాతీయ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ)కి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎందరో ఆటగాళ్లను టీమిండియాలోకి తెచ్చేందుకు కృషి చేస్తోన్న ఈ మాజీ క్రికెటర్​ కొడుకు సమిత్ క్రికెట్​లో రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం అండర్-14లో అదరగొడుతున్నాడు.

ఆల్​రౌండర్​గా జూనియర్​...

ప్రస్తుతం రాష్ట్రస్థాయిలోని అండర్​-14లో ఆడుతోన్న సమిత్​.. తండ్రి లాగే ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ చిన్నోడికి కాస్త దూకుడెక్కువ. తండ్రి నెమ్మదిగా ఆడి పేరు తెచ్చుకుంటే ఈ బుడ్డోడు మాత్రం చెలరేగి ఆడుతున్నాడు.

Rahul Dravid son Samit
రాహుల్​ ద్రవిడ్​-సమిత్​ ద్రవిడ్​

తాజాగా బెంగళూరులో ధార్వాడ్​ జోన్​తో ఆడిన మ్యాచ్​లో వైస్​ ప్రెసిడెంట్స్​ ఎలెవన్​ జట్టు తరఫున తొలి ఇన్నింగ్స్​లో 201 పరుగులు చేశాడు సమిత్​. ఈ స్కోరును 256 బంతుల్లోనే సాధించాడు. వీటిలో 22 ఫోర్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్​లోనూ 94 రన్స్​తో అజేయంగా నిలిచాడీ కుడిచేతి వాటం బ్యాట్స్​మెన్​. బంతితోనూ రాణించగల సత్తా ఇతడి సొంతం. ఈ మ్యాచ్​లో 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే చివరికి ఆట డ్రాగా ముగిసింది.

బెస్ట్​ బ్యాట్స్​మెన్​గా​..

గతేడాది కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన బీటీఆర్‌ కప్‌ అండర్‌-14 ఇంటర్ స్కూల్ టోర్నీలో సమిత్‌ సెంచరీ (150) కొట్టి అందర్నీ ఆకట్టుకున్నాడు. అండర్-12లోనూ ద్రవిడ్ వారసుడు పరుగుల వరద పారించాడు. ఈ టోర్నమెంటులో మూడు అర్ధశతకాలు సాధించి బెస్ట్ బ్యాట్స్​మెన్​గా అవార్డునూ సొంతం చేసుకున్నాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Doha, Qatar. 20th December 2019.
+++SHOTLIST TO FOLLOW+++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 02:28
STORYLINE:
Liverpool trained in Doha on Friday, a day before they will attempt to add the title of world champions to their extensive honours list.
Jurgen Klopp's side - unbeaten in 20 matches across all competitions - needed a last-minute Roberto Firmino goal to edge past Mexico's Monterrey, and book their place in the FIFA Club World Cup final against Copa Libertadores champions Flamengo at the Khalifa International Stadium in Doha on Saturday.
Virgil van Dijk and Georginio Wijnaldum were the most notable absentees from Liverpool's semi-final win with illness and muscle injuries respectively - as captain Jordan Henderson played in an unfamiliar centre-back role.
Sadio Mane, Trent Alexander-Arnold and Firmino all came off the bench against Monterrey and the trio are expected to start Saturday's final.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.