కడప జిల్లా పులివెందులలో కర్ఫ్యూను పరిస్థితులను డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా విధించిన కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలుపరిచేందుకు పులివెందుల పట్టణంలోని నలుమూలలా పికెట్స్, చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిత్యవసర సరుకులు, కూరగాయలు.. వాటి కోసం ప్రజలు ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మాత్రమే బయటకు వచ్చి తీసుకోవాలని తెలిపారు. మిగతా సమయంలో అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
పులివెందులలో కర్ఫ్యూని పరిశీలించిన డీఎస్పీ
కడప జిల్లా పులివెందులలో కర్ఫ్యూను పరిస్థితులను డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. అనవసరంగా బయట తిరుగుతున్న వాహన చోదకులను గుర్తించి వారికి జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు.
curfew