ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు సరఫరా

నిత్యావసర వస్తువులు ఇంటింటికి సరఫరా చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోపు దుకాణాల వద్ద వ్యాపారం చేసుకోవచ్చని, ఇంటింటికి తిరిగి ఏ సమయంలోనైనా వస్తువులు సరఫరా చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

ఇంటి వద్దకే నిత్యావసర వస్తువుల సరఫరా
ఇంటి వద్దకే నిత్యావసర వస్తువుల సరఫరా

By

Published : Mar 30, 2020, 6:44 AM IST

ఇంటి వద్దకే నిత్యావసర వస్తువుల సరఫరా

ప్రజల మధ్య సామాజిక దూరాన్నిపెంచేందుకు ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులను సరఫరా చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. నిత్యావసర వస్తువుల వ్యాపారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇంటి వద్దకే ప్రజలకు కావాల్సిన వస్తువులను వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరవేయాలని వ్యాపారులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోపు దుకాణాల వద్ద వ్యాపారం చేసుకోవచ్చునని, ఇంటింటికి ఏ సమయంలోనైనా సరఫరా చేయవచ్చని తెలిపారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే వస్తువులను విక్రయించే వ్యాపారులను ఇబ్బంది పెట్టమని, నిత్యావసర వస్తువుల సరఫరా చేసే వాహనాలను అడ్డుకోబోమని స్పష్టం చేశారు. అలాగని ధరలు పెంచితే వారిపై కేసులు నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:'సామాజిక దూరం పాటించండి.. రేషన్​ తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details