ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కరోనాపై ఆందోళన వద్దు..అందరూ క్షేమంగా ఇళ్లకు చేరుతారు'

By

Published : Jun 30, 2020, 5:37 PM IST

జమ్మలమడుగు పట్టణంలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తోడుగా ఉంటుందని ఆర్డీఓ నాగన్న ప్రజలకు ధైర్యం చెప్పారు. కరోనా బారిన పడినవారి ఆరోగ్యం కుదటపడి సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటారని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి అన్నారు.

don’t get panic on corona
కరోనాపై ఆందోళన వద్దు

జమ్మలమడుగు పట్టణంలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న‌ జరుగుతోందన్నారు ఆర్డీఓ నాగన్న. కొవిడ్ వ్యాప్తిపై ఎవరూ ఆందోళ‌న చెందవద్దని.. ప్ర‌భుత్వం తోడుగా ఉంటుందని ప్రజలకు ధైర్యం చెప్పారు. కరోనా బారిన పడినవారి ఆరోగ్యం కుద‌ట‌ప‌డి సుర‌క్షితంగా ఇళ్లకు చేరుకుంటారని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి అన్నారు.

ఏఎన్ఎంల ద్వారా అవ‌స‌ర‌మైన మందులు ఇంటికే పంపుతున్న‌ట్లు చెప్పారు. కరోనా వచ్చిన వారిని అంటరాని వారిగా చూడొద్దని సూచించారు. పట్టణంలో కరోనాపై ఆయా శాఖ‌ల అధికారులు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప్రశంసించారు. పోలీసులు, రెవెన్యూ, వైద్య‌, మండ‌ల‌ప‌రిష‌త్ సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో త‌హ‌శీల్దార్ మధుసూదన్ రెడ్డి, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, మునిసిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: అపరిశుభ్ర వాతావరణంలో ఎలా పని చేయాలి- మహిళా కండక్టర్లు

ABOUT THE AUTHOR

...view details