కడప జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. రానున్న రెండు వారాల పాటు కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని.. లేదంటే ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.
వాటికి కొంత సడలింపు..
వైద్యం, మందులు, ఇతర అత్యవసరాలు, అంబులెన్సులు, వైద్యులకు మాత్రమే కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపు ఇస్తున్నామని.. మిగిలిన దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసివేయాలని కోరారు. కొవిడ్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలంతా రెండు వారాల పాటు చేపట్టిన ఆంక్షలకు సహకరించాలని ఎస్పీ స్పష్టం చేశారు.