ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ముస్లింలు రంజాన్​ వేడుకలు ఇళ్లలోనే చేసుకోవాలి'

By

Published : Apr 22, 2020, 8:36 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం, అధికారులు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్​ బాషా తెలిపారు. వైరస్​ వ్యాప్తి దృష్ట్యా ముస్లిం సోదరులు ఈసారి రంజాన్​ వేడుకలను ఇళ్లలోనే ఉండి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

'ముస్లింలు రంజాన్​ వేడుకలు ఇళ్లలోనే చేసుకోవాలి'
'ముస్లింలు రంజాన్​ వేడుకలు ఇళ్లలోనే చేసుకోవాలి'

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి అంజద్​ బాషా తెలిపారు. ఇప్పటికే లక్ష ర్యాపిడ్ కిట్లు రాష్ట్రానికి వచ్చాయని... అనుమతులు రాగానే వాటి ద్వారా పరీక్షలు చేస్తారని చెప్పారు. కడప జిల్లాలో హైపో ద్రావణం పిచికారీ చేసేందుకు రూ.3.70 లక్షలతో కొనుగోలు చేసిన యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రెడ్​జోన్​​ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు హైపో ద్రావణం పిచికారీ చేయిస్తున్నట్లు వివరించారు. వైరస్​ వ్యాప్తి దృష్ట్యా.. ముస్లిం సోదరులు రంజాన్​ మాసాన్ని ఇళ్లలోనే ఉండి చేసుకోవాలని అంజద్​ బాషా విజ్ఞప్తి చేశారు. వైరస్​ అదుపునకు సహకరిస్తామని ముస్లింలు మాట ఇచ్చినట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details