ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదల ఆకలి తీర్చేందుకు విరాళాలు ఇవ్వండి'

కరోనా ప్రభావంతో జిల్లాలో చాలా మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారని, వారి సమస్య తీర్చేందుకు దాతలు విరాళాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి అంజద్​ బాషా పిలుపునిచ్చారు. శనివారం కడప నగర పాలక సంస్థ కార్యాలయంలో వ్యాపారులు, ప్రముఖులతో సమావేశం నిర్వహించారు.

deputy cm amjab basha asked donation
కడప నగర కార్యాలయంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి అంజద్​ భాషా

By

Published : Mar 29, 2020, 7:32 PM IST

ఉప ముఖ్యమంత్రి అంజద్​ బాషా

కరోనా వైరస్​ విజృంభణ.... లాక్​డౌన్​ కారణంగా నిరుపేదలు పస్తులుంటున్నారు. వీరీని ఆదుకునేందుకు ఉప ముఖ్యమంత్రి అంజద్​ బాషా కడప నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్, ఆర్డీవో, అధికారులతో పాటు నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 30 నుంచి కడప నగరంలోని 5 వేల మంది పేదలకు మూడు పూటల భోజనం, మరో 25 వేల మందికి నిత్యావసర వస్తువులను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం విరాళాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. తన వంతు సాయంగా 10 లక్షల రూపాయలు ప్రకటించారు. ప్రభుత్వ పరంగా పేదలకు 29వ తేదీ నుంచి రేషన్​ కార్డు దారులందరికీ ఉచితంగా రేషన్​ అందిస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్​ 4న వెయ్యి రూపాయల నగదు అందిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details