రాష్ట్రంలో నివర్ తుపాను వలన దెబ్బతిన్న రహదారులు, కల్వర్టుల మరమ్మతులకు రూ.550 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టినట్లు.. రహదారులు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఎన్‌డీబీ) నుంచి మొదటి విడతలో కడప జిల్లా కేంద్రం నుంచి అన్ని మండల కేంద్రాలకు సింగిల్, డబుల్ రోడ్ల నిర్మాణానికి రూ.2,970 కోట్లు మంజూరైనట్లు వివరించారు. ఈ పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించినట్లు స్పష్టం చేశారు. రెండో విడతలో రూ.3 వేల కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
'దెబ్బతిన్న రహదారులు, కల్వర్టుల మరమ్మతులకు రూ.550 కోట్లు'
రహదారి అభివృద్ధి పనులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు.. రహదారులు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
హదారులు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు