ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటివద్దకే నిత్యావసరాలు - కడపలో రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటివద్దకే నిత్యావసరాలు

కడప జిల్లాలో రెడ్ జోన్​గా ప్రకటించిన ప్రాంతాల్లో ఇళ్లవద్దకే కూరగాయలు, నిత్యావసర సరకులు అందజేస్తున్నారు. వ్యాపారుల సాయంతో పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని... ఫోన్ చేస్తే తామే వచ్చి సరకులు అందిస్తామని చెప్పారు.

daily needs door delivery in kadapa red zone areas
ఇళ్ల వద్దకు నిత్యావసరాలు చేరవేసేందుకు సిద్ధంగా ఉన్న ఆటోలు

By

Published : Apr 12, 2020, 12:45 PM IST

కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రెడ్ జోన్​గా ప్రకటించిన ప్రాంతాల్లో నిత్యావసర సరకులు ఇంటివద్దకే సరఫరా చేస్తున్నారు. కూరగాయల వ్యాపారుల సంఘం సహకారంతో పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా గద్వాల, సిద్ధవటం, మైదుకూరు, పోరుమామిళ్ల తదితర ప్రాంతాల్లో ఇళ్లవద్దకు తీసుకెళ్లి అందజేస్తున్నారు. నిత్యావసర సరకులు కావలసినవారు 9392302424 నంబరుకు ఫోన్ చేయాలని పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details