పది రోజుల కిందట కడప కేంద్ర కారాగారంలో ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 317 మందికి పాజిటివ్ వచ్చినట్లు జైలు అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు వారందరినీ జైల్లోని ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి కావలసిన మందులను, వేడినీటిని, పౌష్టికాహారాన్ని మాస్కులను జైలు అధికారులు అందజేస్తున్నారు. 14 రోజుల తర్వాత మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వచ్చిన తర్వాత ..వారిని బ్యారక్ లోకి పంపిస్తామని అధికారులు వెల్లడించారు.
కేంద్ర కారాగారంలో కోలుకుంటున్న కరోనా సోకిన ఖైదీలు - కడప జిల్లా వార్తలు
కడప కేంద్ర కారాగారంలో కరోనా సోకిన ఖైదీలు నెమ్మదిగా కోలుకుంటున్నారు. గత పది రోజుల కిందట 317 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే వారందరికీ వైద్యం అందిస్తున్నామని.. ఖైదీలు కోలుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.
Corona infected
ఇటీవల రిమాండ్ కోసం వచ్చిన మరో నలుగురు ఖైదీలకు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వారికీ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్నామని..నిబంధనలు పాటిస్తున్నామని, జైలు ఆవరణ అంతా ద్రవణంతో పిచికారి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:చైనా రక్షణమంత్రితో రాజ్నాథ్ భేటీ లేదు'