ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పథకాల పేర్లు మార్చి మభ్యపెడుతున్నారు'

గతంలో ఉన్న ఫీజు రీయంబర్స్​మెంట్​ పథకానికి పేరుమార్చి ప్రజలను మభ్యపెడుతున్నారని... రాష్ట్ర కాంగ్రెస్​ వర్కింగ్ కమిటి ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లేలోని తన స్వగహంలో ఆయన సమావేశం నిర్వహించారు.

వేంపల్లేలో తులసిరెడ్డి ప్రెస్​మీట్​
వేంపల్లేలో తులసిరెడ్డి ప్రెస్​మీట్​

By

Published : Apr 28, 2020, 10:33 PM IST

మాట్లాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి

పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టి... ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని... రాష్ట్ర కాంగ్రెస్​ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. కొత్త ఇంటికి సున్నం కొట్టి ఇంట్లోకి చేరినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కడప జిల్లా వేంపల్లెలో తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద' ఇవన్నీ గతంలో కాంగ్రెస్ హయాంలో దివంగత నేత వైఎస్​.రాజశేఖర్​ రెడ్డి 2008-09లో ప్రవేశపెట్టిన పథకాలని చెప్పారు. ఇప్పుడు కూడా అవి అమల్లో ఉన్నాయని... పేర్లు మార్చారని తులసి రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'కరోనాపై ప్రభుత్వానికి ఏం పట్టడం లేదు'

ABOUT THE AUTHOR

...view details