జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. అమరావతిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో జమ్మలమడుగు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. స్వలాభం కోసం వచ్చి వెళ్లిన నాయకుల వల్ల తెలుగుదేశానికి నష్టమేమీ లేదన్నారు. జగన్ ఊకదంపుడులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.
స్వలాభం కోసం బయటకు వెళ్లేవారితో పార్టీకి నష్టం లేదు: చంద్రబాబు - జమ్మలమడుగు రాజకీయంపై చంద్రబాబు వ్యాఖ్యలు
అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జమ్మలమడుగు తెదేపా కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. జమ్మలమడుగు, పులివెందుల ఇన్‌ఛార్జ్‌గా ఎమ్మెల్సీ బీటెక్ రవిని నియమించారు. స్వలాభం కోసం పార్టీలోకి వచ్చి వెళ్లే నాయకులతో నష్టమేమీ లేదని.. ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసిందన్నారు.
chandra babu meet with jammalamadugu tdp leaders
ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే పార్టీ ఎన్నో ఆటుపోట్లను చవిచూసి... వాటన్నింటినీ సమర్థమంతంగా తిప్పికొట్టిందని చంద్రబాబు అన్నారు. పాతనీరు పోయి.. కొత్తనీరు రావడం తెదేపాకు ఆది నుంచీ ఆనవాయితీనే అన్నారు. ఆయారాం, గయారాంతో పార్టీకి నష్టమేమీ లేదన్నారు. బీటెక్ రవి నాయకత్వంలో కార్యకర్తలందరూ స్థానిక ఎన్నికలలో పోటీ చేసి తెదేపా బలపరిచిన అభ్యర్ధుల గెలపునకు కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి:ఈ-వాచ్ యాప్ వాడకంలోకి తేవద్దు: హైకోర్టు